![]() |
![]() |
.webp)
కుక్కు విత్ జాతి రత్నాలు షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి కృతిక, శ్రవణ్ కుమార్, సుమిత్ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళ హంగామా మాములుగా లేదు. అలాగే సేవ్ ది టైగర్స్ సీజన్ 3 టీమ్ కూడా వచ్చింది. కుక్కు విత్ జాతిరత్నాలు షో డబుల్ డోస్ తో ఉండబోతోంది అంటూ అనౌన్స్ చేశారు. ఇక నిఖిల్ విజయేంద్రసింహా డ్రెస్ అక్కడక్కడా ఉన్న చిరుగులతో వేసుకుని వచ్చేసరికి హరి నీ కోటు ఇవ్వా నిఖిల్ కి ఇస్తాను అంటూ కామెడీ చేసింది రోహిణి. "నీ పెర్ఫార్మెన్స్ చూసి వేరే చింపేయాలి కానీ నువ్వే చింపేసుకున్నావ్ ఏంటి " అంటూ హరి నిఖిల్ మీద కామెడీ చేసాడు. "హరి ఏమన్నాడంటే కుకింగ్ లో అవకాశం ఇవ్వండి అంటున్నాడు మరి జడ్జెస్ మీరేమన్నా అవకాశం ఇస్తే " అంటూ రాకేష్ అడిగేసరికి "నీకు అవకాశం ఇచ్చినందుకు జడ్జెస్ ఇప్పటికీ ఫీలవుతున్నారు " అంటూ అవినాష్ రాకేష్ పరువు తీసేసాడు. ఇక కృతిక ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పునర్నవి వచ్చింది.

ఇక తనకు కంఫర్ట్ ఫుడ్ బీట్ రూట్ రసం చికెన్ ఫ్రై అని చెప్పింది. మరో వైపు దీపికా సీరియల్ నటుడు సుమిత్ తో కలిసి కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందించింది. కోట్ పట్టుకుని లాగేసి డాన్స్ చేసి అతని పరువు తీసేసింది. "టెలివిజన్ చరిత్రలో ఆయన ఇప్పటి వరకు భయపడడం నేను చూడలా .. ఫస్ట్ టైం కొంచెం జంకాడు" అంటూ సుమిత్ గురించి ప్రదీప్ చెప్పాడు. ఇక ఆలీ ఐతే "ప్రదీప్ మేము ఇప్పటి వరకు ఏ కండిషన్ పెట్టలేదు కదా ఎండింగ్ వరకు జాతిరత్నంగా వీళ్ళిద్దరే ఉండాలి " అని చెప్పేసరికి దీపికా "సీజన్ ఎండింగ్ ఏంటి సర్ లైఫ్ ఎండింగ్ వరకు ఉంటాను " అనేసింది.
తర్వాత శ్రవణ్ వచ్చాడు "నేను ఏ వంటకం నేర్చుకున్నా మా నానమ్మతో అమ్మతో వేళ్లతోనే నేర్చుకున్నాను ఏదేమైనా నేను బటర్ తోనే వంట చేస్తాను " అన్నాడు. వెంటనే రోహిణి " ఐ లవ్ బటర్ " అంది. "గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ ఇంప్రెస్స్ చేసి చేసి హార్ట్ పడిపోయింది. " అని చెప్పాడు. వెంటనే రోహిణి "ఈసారి నేను లేపుతా " అంటూ డైలాగ్ వేసింది. దాంతో అందరూ నవ్వేశారు. ఈ ప్రోమోలో తనూజ, గోమతి ప్రియా, రీతూ, తేజస్విని ఎవరూ కనిపించలేదు. ఐతే ఒక నెటిజన్ మాత్రం ఒక రిప్లై ఇచ్చారు. డీమన్ పవన్, నిఖిల్ కుక్ -ఆఫ్ కి వెళ్లి గెలిచారు. శ్రవణ్ కుమార్ -సుమిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చి ఎలిమినేటి అయ్యారు అని చెప్పుకొచ్చారు.
![]() |
![]() |